పి.సుశీల: తన గాత్రంతో సినిమా పాటలను సుసంపన్నం చేసిన మధురగాయని .

బీబీసీ కోసం
2 గంటలు క్రితం

మధుర గాయని పి. సుశీల. నేపథ్యగాయనిగా చిరకాలం గుర్తుండిపోయే ఎన్నో పాటలు పాడారు.దక్షిణాది గానకోకిలగా ప్రసిద్ధి పొందిన సుశీల తన 70 ఏళ్ల పైబడిన సినిమా జీవితంలో దాదాపు 60వేలకు పైగా పాటలు పాడారు.

సుశీల పాట అమ్మ ఒడిలోని లాలిపాటలా మనల్ని నిద్ర పుచ్చి ఉండవచ్చు. అది విరహమైనా, వైరాగ్యమైనా, మోహమైనా, భక్తి పారవశ్యమైనా.. ఆమె పాటకు ఆమే సాటి. ఆమె పాటల ఒడిలో సేదతీరిన మనకు ఆమె 90వ పడిలో పడుతుంటే ఏమని రాయాలి?.

ఎక్కడి విజయనగరం... ఎక్కడి చెన్నై మహానగరం. తెలుగు ఒక్కటే కాదు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడగ, సింహళ .. అలా దాదాపు 12 భాషల్లో పాటలు పాడిన ప్రస్థానం సుశీలది.

విజయనగరంలో న్యాయవాది పులపాక ముకుందరావు, శేషావతారం దంపతులకు సుశీల 1935 నవంబరు 13న జన్మించారు.

సంగీతాభిరుచిగల కుటుంబం వారిది. తండ్రి వీణావాద్యకారుడు కూడా. అందుకే సుశీలకు చిన్నప్పుడే కర్ణాటక సంగీతంలో శిక్షణ ఇప్పించారు. తరచూ సంగీత విద్వాంసులనూ, విమర్శకులనూ ఇంటికి ఆహ్వానించేవారు ముకుందరావు. తన కుమార్తె మరో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి కావాలనేది ఆయన ఆకాంక్ష. కానీ ఆమె సినిమా సంగీతం వైపే ఆకర్షితురాలయ్యారు.

స్కూలు రోజుల్లోనే అనేక పాటల పోటీల్లో పాల్గొన్నారు సుశీల. ఆమెకు వచ్చిన బహుమతులతోనే ఇంట్లో అల్మారాలు నిండిపోయాయి. విజయనగరం మహారాజా సంగీత, నృత్య కళాశాల నుంచి సంగీతంలో డిప్లొమా తీసుకున్నారు సుశీల.

తనకన్నా పదేళ్ల ముందే కళా రంగంలోకి వచ్చిన లతా మంగేష్కర్ పాటలు ఆమెను ఎంతో ఆకర్షించేవి. 1950లో రేడియోలో నిర్వహించిన ఒక పోటీలో సుశీల పాడిన పాట ఆమె సంగీత ప్రస్థానానికి నాందిగా చెప్పాలి.
పి.సుశీల: తన గాత్రంతో సినిమా పాటలను సుసంపన్నం చేసిన మధురగాయని . బీబీసీ కోసం 2 గంటలు క్రితం మధుర గాయని పి. సుశీల. నేపథ్యగాయనిగా చిరకాలం గుర్తుండిపోయే ఎన్నో పాటలు పాడారు.దక్షిణాది గానకోకిలగా ప్రసిద్ధి పొందిన సుశీల తన 70 ఏళ్ల పైబడిన సినిమా జీవితంలో దాదాపు 60వేలకు పైగా పాటలు పాడారు. సుశీల పాట అమ్మ ఒడిలోని లాలిపాటలా మనల్ని నిద్ర పుచ్చి ఉండవచ్చు. అది విరహమైనా, వైరాగ్యమైనా, మోహమైనా, భక్తి పారవశ్యమైనా.. ఆమె పాటకు ఆమే సాటి. ఆమె పాటల ఒడిలో సేదతీరిన మనకు ఆమె 90వ పడిలో పడుతుంటే ఏమని రాయాలి?. ఎక్కడి విజయనగరం... ఎక్కడి చెన్నై మహానగరం. తెలుగు ఒక్కటే కాదు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడగ, సింహళ .. అలా దాదాపు 12 భాషల్లో పాటలు పాడిన ప్రస్థానం సుశీలది. విజయనగరంలో న్యాయవాది పులపాక ముకుందరావు, శేషావతారం దంపతులకు సుశీల 1935 నవంబరు 13న జన్మించారు. సంగీతాభిరుచిగల కుటుంబం వారిది. తండ్రి వీణావాద్యకారుడు కూడా. అందుకే సుశీలకు చిన్నప్పుడే కర్ణాటక సంగీతంలో శిక్షణ ఇప్పించారు. తరచూ సంగీత విద్వాంసులనూ, విమర్శకులనూ ఇంటికి ఆహ్వానించేవారు ముకుందరావు. తన కుమార్తె మరో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి కావాలనేది ఆయన ఆకాంక్ష. కానీ ఆమె సినిమా సంగీతం వైపే ఆకర్షితురాలయ్యారు. స్కూలు రోజుల్లోనే అనేక పాటల పోటీల్లో పాల్గొన్నారు సుశీల. ఆమెకు వచ్చిన బహుమతులతోనే ఇంట్లో అల్మారాలు నిండిపోయాయి. విజయనగరం మహారాజా సంగీత, నృత్య కళాశాల నుంచి సంగీతంలో డిప్లొమా తీసుకున్నారు సుశీల. తనకన్నా పదేళ్ల ముందే కళా రంగంలోకి వచ్చిన లతా మంగేష్కర్ పాటలు ఆమెను ఎంతో ఆకర్షించేవి. 1950లో రేడియోలో నిర్వహించిన ఒక పోటీలో సుశీల పాడిన పాట ఆమె సంగీత ప్రస్థానానికి నాందిగా చెప్పాలి.
Like
Love
3
0 Comments 0 Shares 254 Views 0 Reviews