చైనా: స్టేడియంలో జనంపైకి దూసుకెళ్లిన కారు, 35 మంది మృతి.

బీబీసీ ప్రతినిధులు
35 నిమిషాలు క్రితం

దక్షిణ చైనాలో ఓ వ్యక్తి అతివేగంగా జనంపైకి కారును పోనిచ్చిన ఘటనలో కనీసం 35 మంది చనిపోయారు. గడచిన కొన్ని దశాబ్దాల్లో చైనాలో జరిగిన అత్యంత దారుణమైన ఘటనగా దీనిని చెబుతున్నారు.

సోమవారం చైనాలోని జుహయ్‌ ప్రాంతంలోని ఒక స్టేడియంలో ప్రజలు వ్యాయామాలు చేసుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి వేగంగా జనంపైకి కారు పోనిచ్చాడని పోలీసులు తెలిపారు.

ఈ దారుణమైన ఘటనలో దాదాపు 45 మంది గాయపడ్డారు. వారిలో వృద్ధులు, పిల్లలు ఉన్నారని స్థానిక మీడియా చెబుతోంది.

విడాకుల కేసులో అసంతృప్తిగా ఉన్న 62 ఏళ్ల ‘ఫ్యాన్‌’ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు.

జుహయ్ స్టేడియం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన డ్రైవర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికే అతను తన ఒంటిపై తనకు తానుగా చేసుకున్న గాయాలు ఉన్నాయని, తద్వారా కోమాలోకి వెళ్లిపోయాడని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విచారం వ్యక్తమవుతోంది.
చైనా: స్టేడియంలో జనంపైకి దూసుకెళ్లిన కారు, 35 మంది మృతి. బీబీసీ ప్రతినిధులు 35 నిమిషాలు క్రితం దక్షిణ చైనాలో ఓ వ్యక్తి అతివేగంగా జనంపైకి కారును పోనిచ్చిన ఘటనలో కనీసం 35 మంది చనిపోయారు. గడచిన కొన్ని దశాబ్దాల్లో చైనాలో జరిగిన అత్యంత దారుణమైన ఘటనగా దీనిని చెబుతున్నారు. సోమవారం చైనాలోని జుహయ్‌ ప్రాంతంలోని ఒక స్టేడియంలో ప్రజలు వ్యాయామాలు చేసుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి వేగంగా జనంపైకి కారు పోనిచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ దారుణమైన ఘటనలో దాదాపు 45 మంది గాయపడ్డారు. వారిలో వృద్ధులు, పిల్లలు ఉన్నారని స్థానిక మీడియా చెబుతోంది. విడాకుల కేసులో అసంతృప్తిగా ఉన్న 62 ఏళ్ల ‘ఫ్యాన్‌’ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. జుహయ్ స్టేడియం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన డ్రైవర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికే అతను తన ఒంటిపై తనకు తానుగా చేసుకున్న గాయాలు ఉన్నాయని, తద్వారా కోమాలోకి వెళ్లిపోయాడని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విచారం వ్యక్తమవుతోంది.
Sad
Like
4
0 Comments 0 Shares 252 Views 0 Reviews