యాదగిరి గుట్ట యాదాద్రి ఎలా అయ్యింది, మళ్లీ పాత పేరుతోనే పిలవాలని రేవంత్ ప్రభుత్వం ఎందుకు అంటోంది?

తెలంగాణలో లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఉన్న యాదాద్రి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఇకపై పాత పద్ధతిలో యాదగిరి గుట్ట పేరుతోనే పిలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.

అయితే వాస్తవానికి ఆ ఊరి పేరును ఎన్నడూ యాదాద్రిగా అధికారికంగా మార్చలేదు. అయినా, ఈ యాదాద్రి – యాదగిరి అనే గొడవ ఎందుకొచ్చింది?

దేవాలయ క్షేత్ర మహిమ చెప్పే క్రమంలో, యాద మహర్షి లేదా యాదర్షి అనే ఒక రుషి పేరు మీద ఈ క్షేత్రం యాదగిరి అయిందని చెబుతారు.

ఇది హిందువుల విశ్వాసానికి సంబంధించినది. చారిత్రక ఆధారాలు లేవు.

స్థానికులు వ్యవహారంలో యాదగిరి గుట్ట లేదా సంక్షిప్తంగా గుట్ట అని పిలిచేవారు. గుట్ట దేవుడు, గుట్ట స్వామి అని యాదగిరి గుట్ట మీద ఉండే దేవుడిని తెలంగాణలో చాలామంది పిలుస్తుంటారు.

పుణ్యక్షేత్రాల పేర్లు హిందువులకు పెట్టుకునే ఆచారంలో భాగంగా, యాదగిరి అనే పేరు తెలంగాణలోని పలువురు పెట్టుకోవడం కూడా కనిపిస్తుంది.

ఇక గిరి అనే సంస్కృత పదం, గుట్ట అనే తెలుగు పదం రెండూ ఒకే అర్థాన్ని ఇస్తాయి. దక్షిణ తెలంగాణలో గుట్టకెళుతున్నాం అని చెప్పారంటే యాదగిరి గుట్టకు వెళుతున్నారనే అనుకుంటారు.

అందుకే, గిరి అని పిలిచినా, గుట్ట అని పిలిచినా వాటి అర్థం ఒక్కటే. అయినప్పటికీ వాడుకలో రెండు పదాలూ కలిపే ఈ క్షేత్రాన్ని యాదగిరి గుట్టగా పిలుస్తారు.
యాదగిరి గుట్ట యాదాద్రి ఎలా అయ్యింది, మళ్లీ పాత పేరుతోనే పిలవాలని రేవంత్ ప్రభుత్వం ఎందుకు అంటోంది? తెలంగాణలో లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఉన్న యాదాద్రి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఇకపై పాత పద్ధతిలో యాదగిరి గుట్ట పేరుతోనే పిలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అయితే వాస్తవానికి ఆ ఊరి పేరును ఎన్నడూ యాదాద్రిగా అధికారికంగా మార్చలేదు. అయినా, ఈ యాదాద్రి – యాదగిరి అనే గొడవ ఎందుకొచ్చింది? దేవాలయ క్షేత్ర మహిమ చెప్పే క్రమంలో, యాద మహర్షి లేదా యాదర్షి అనే ఒక రుషి పేరు మీద ఈ క్షేత్రం యాదగిరి అయిందని చెబుతారు. ఇది హిందువుల విశ్వాసానికి సంబంధించినది. చారిత్రక ఆధారాలు లేవు. స్థానికులు వ్యవహారంలో యాదగిరి గుట్ట లేదా సంక్షిప్తంగా గుట్ట అని పిలిచేవారు. గుట్ట దేవుడు, గుట్ట స్వామి అని యాదగిరి గుట్ట మీద ఉండే దేవుడిని తెలంగాణలో చాలామంది పిలుస్తుంటారు. పుణ్యక్షేత్రాల పేర్లు హిందువులకు పెట్టుకునే ఆచారంలో భాగంగా, యాదగిరి అనే పేరు తెలంగాణలోని పలువురు పెట్టుకోవడం కూడా కనిపిస్తుంది. ఇక గిరి అనే సంస్కృత పదం, గుట్ట అనే తెలుగు పదం రెండూ ఒకే అర్థాన్ని ఇస్తాయి. దక్షిణ తెలంగాణలో గుట్టకెళుతున్నాం అని చెప్పారంటే యాదగిరి గుట్టకు వెళుతున్నారనే అనుకుంటారు. అందుకే, గిరి అని పిలిచినా, గుట్ట అని పిలిచినా వాటి అర్థం ఒక్కటే. అయినప్పటికీ వాడుకలో రెండు పదాలూ కలిపే ఈ క్షేత్రాన్ని యాదగిరి గుట్టగా పిలుస్తారు.
Love
Like
3
0 Comments 0 Shares 248 Views 0 Reviews