వైఎస్ఆర్ జిల్లాలోని గండికోటను పర్యాటక ప్రాంతంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. గండికోట అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.78 కోట్ల విలువైన టూరిజం ప్రాజెక్టు మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. గండికోటను గ్యాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా అభివృద్ధి చేసేలా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ రూ.78 కోట్ల విలువైన టూరిజం ప్రాజెక్టు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని వెల్లడించారు. పెన్నా నది ఒడ్డున ఉన్న గండికోట అభివృద్ధి, సంరక్షణకు సహకరించాలని కోరుతూ గతంలో కేంద్ర పర్యాటక శాఖకు పెమ్మసాని చంద్రశేఖర్ లేఖ రాశారు. ఈ లేఖకు స్పందిస్తూ కేంద్ర పర్యాటకశాఖ రూ.78 కోట్ల గండికోట టూరిజం ప్రాజెక్టును ఆమోదించిందని పేర్కొన్నారు. ఇందుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ధన్యవాదాలు తెలియజేశారు పెమ్మసాని.