తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్ట్.. రూ.205 కోట్లు విడుదల.. 2 రోజుల్లో పనులు ప్రారంభం..!
Mamnoor Airport: తెలంగాణలో ఇప్పటివరకు కేవలం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు మరో ఎయిర్ పోర్ట్ కూడా అందుబాటులోకి రానుంది. అది ఎక్కడో కాదు.. తెలంగాణకు రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెప్తున్న వరంగల్‌లోనే. ఖిల్లా వరంగల్ మండలంలోని మామూనూరు ప్రాంతంలోని ఎయిర్ పోర్ట్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే కసరత్తు షురూ చేయగా.. ప్రస్తుతం మరో కీలక ముందడుగు పడింది. ఎయిర్ పోర్ట్ విస్తరణకు.. కావాల్సిన భూసేకరణ కోసం మంత్రుల బృందం ఇటీవలే మామునూరు ప్రాంతంలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. విమానాశ్రయ విస్తరణకు మొత్తంగా 253 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా.. ఈ దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.

ఎయిర్ పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణ కోసం రూ.205 కోట్లను విడుదల చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ జీవో జారీ చేసింది. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లతో కూడిన డీపీఆర్‌ను వేగంగా సిద్ధం చేయాలని ఎయిర్ పోర్ట్ అథారిటీకి ఆర్ ఆండ్ బీ శాఖ లేఖ కూడా రాసింది. మామునూర్ విమానాశ్రయ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల పరిధి ఒప్పందాన్ని జీఎమ్మాఆర్ సంస్థ విరమించుకుంది. ఇప్పటికే ఎయిర్ పోర్ట్ పరిధిలో 696 ఎకరాల భూమి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కొత్తగా సేకరించే 253 ఎకరాల భూమిని రన్ వే విస్తరణకు, నెవిగేషనల్ ఇన్‌స్ట్రూమెంట్ ఇన్‌స్టాలేషన్ విభాగాల కోసం నిర్మాణాలకు, ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్), టెర్మినల్ బిల్డింగ్‌ కోసం వినియోగించనున్నారు.
తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్ట్.. రూ.205 కోట్లు విడుదల.. 2 రోజుల్లో పనులు ప్రారంభం..! Mamnoor Airport: తెలంగాణలో ఇప్పటివరకు కేవలం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు మరో ఎయిర్ పోర్ట్ కూడా అందుబాటులోకి రానుంది. అది ఎక్కడో కాదు.. తెలంగాణకు రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెప్తున్న వరంగల్‌లోనే. ఖిల్లా వరంగల్ మండలంలోని మామూనూరు ప్రాంతంలోని ఎయిర్ పోర్ట్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే కసరత్తు షురూ చేయగా.. ప్రస్తుతం మరో కీలక ముందడుగు పడింది. ఎయిర్ పోర్ట్ విస్తరణకు.. కావాల్సిన భూసేకరణ కోసం మంత్రుల బృందం ఇటీవలే మామునూరు ప్రాంతంలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. విమానాశ్రయ విస్తరణకు మొత్తంగా 253 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా.. ఈ దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఎయిర్ పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణ కోసం రూ.205 కోట్లను విడుదల చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ జీవో జారీ చేసింది. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లతో కూడిన డీపీఆర్‌ను వేగంగా సిద్ధం చేయాలని ఎయిర్ పోర్ట్ అథారిటీకి ఆర్ ఆండ్ బీ శాఖ లేఖ కూడా రాసింది. మామునూర్ విమానాశ్రయ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల పరిధి ఒప్పందాన్ని జీఎమ్మాఆర్ సంస్థ విరమించుకుంది. ఇప్పటికే ఎయిర్ పోర్ట్ పరిధిలో 696 ఎకరాల భూమి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కొత్తగా సేకరించే 253 ఎకరాల భూమిని రన్ వే విస్తరణకు, నెవిగేషనల్ ఇన్‌స్ట్రూమెంట్ ఇన్‌స్టాలేషన్ విభాగాల కోసం నిర్మాణాలకు, ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్), టెర్మినల్ బిల్డింగ్‌ కోసం వినియోగించనున్నారు.
Like
Love
3
0 Commentaires 0 Parts 152 Vue 0 Aperçu