Tata Group: టాటాల బిగ్ డీల్.. పెగట్రాన్ ఐఫోన్ ప్లాంట్ కొనుగోలు.. తైవాన్ సంస్థతో ఒప్పందం!

Tata iPhone Plant: భారతదేశంలో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద సంస్థ టాటా గ్రూప్. లేటెస్ట్ గణాంకాల ప్రకారం.. దీని ఎం క్యాప్ ఏకంగా రూ. 33 లక్షల కోట్లకుపైమాటే. ఇందులో ఎక్కువ భాగంగా ఇటీవలి కొన్ని సంవత్సరాల్లోనే రావడం విశేషం. దీనికి కారణం లేకపోలేదు. గత కొంతకాలంగా టాటా గ్రూప్ తమ వ్యాపారాల్ని పెద్ద మొత్తంలో విస్తరిస్తూ వెళ్తోంది. అవకాశం ఉన్న అన్ని రంగాల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతోంది. కొత్త వ్యాపారాల్లోకి కూడా అడుగు పెడుతోంది. ఇప్పటికే స్టీల్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, టెక్నాలజీస్, హోటల్స్, ఇంజినీరింగ్ అండ్ సర్వీసెస్, పవర్, సోలార్ ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కకు మించి టాటా గ్రూప్ కంపెనీలు వ్యాపారాల్లో ముందువరుసలో ఉన్నాయి. కొంత కాలం కిందట ఐఫోన్ల తయారీలోకి కూడా ప్రవేశించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు దీనిని మరింత విస్తరించేందుకు మరో పెద్ద ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు చెన్నైలో ఉన్న ఐఫోన్ ప్లాంట్‌ను తమ సొంతం చేసుకునేందుకు.. తైవాన్ దిగ్గజ సంస్థ పెగట్రాన్‌తో టాటాలు ఇప్పుడు ఒక ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఇదివరకే.. తమ తయారీ కార్యకలాపాల్ని చైనా నుంచి ఇతర దేశాలకు మళ్లించేందుకు.. ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్.. ప్రత్యామ్నాయంగా భారత్‌ను ఎంచుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తైవాన్‌కు చెందిన కాంట్రాక్ట్ తయారీ సంస్థ పెగట్రాన్.. భారత్‌లో యాపిల్ ఐఫోన్లు రూపొందించేందుకు చెన్నైలో ఒక ప్లాంట్ నిర్మించింది. ఇప్పుడు అదే ప్లాంట్‌లో మెజారిటీ వాటాను దక్కించుకునేందుకు టాటా గ్రూప్ సబ్సిడరీ టాటా ఎలక్ట్రానిక్స్.. పెగట్రాన్‌తో ఒప్పందం చేసుకోవడంతో పాటుగా.. జాయింట్ వెంచర్ నెలకొల్పుతున్నట్లు రాయిటర్స్ పేర్కొంది. ఆ ప్లాంట్‌లో 60 శాతం వాటాను సొంతం చేసుకుంటున్న టాటా. రోజువారీగా కార్యకపాలాల్ని పర్యవేక్షిస్తుందని.. ఇక 40 శాతం వాటా ఉండే పెగట్రాన్ ఇతర కార్యకలాపాలు నిర్వహించడంతో పాటుగా.. సాంకేతిక మద్దతు అందిస్తుందని తెలుస్తోంది.
మనదేశంలో ఇప్పుడు టాటాలు మినహాయిస్తే.. ఫాక్స్‌కాన్ మాత్రమే ఐఫోన్లు తయారు చేస్తుంది. కిందటేడాది ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ల సరఫరాలో మనదేశ వాటా 12-14 శాతంగా ఉండగా.. ఈ సంవత్సరం అది దాదాపు రెట్టింపు అవుతుందనే అంచనాలున్నాయి.
Tata Group: టాటాల బిగ్ డీల్.. పెగట్రాన్ ఐఫోన్ ప్లాంట్ కొనుగోలు.. తైవాన్ సంస్థతో ఒప్పందం! Tata iPhone Plant: భారతదేశంలో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద సంస్థ టాటా గ్రూప్. లేటెస్ట్ గణాంకాల ప్రకారం.. దీని ఎం క్యాప్ ఏకంగా రూ. 33 లక్షల కోట్లకుపైమాటే. ఇందులో ఎక్కువ భాగంగా ఇటీవలి కొన్ని సంవత్సరాల్లోనే రావడం విశేషం. దీనికి కారణం లేకపోలేదు. గత కొంతకాలంగా టాటా గ్రూప్ తమ వ్యాపారాల్ని పెద్ద మొత్తంలో విస్తరిస్తూ వెళ్తోంది. అవకాశం ఉన్న అన్ని రంగాల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతోంది. కొత్త వ్యాపారాల్లోకి కూడా అడుగు పెడుతోంది. ఇప్పటికే స్టీల్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, టెక్నాలజీస్, హోటల్స్, ఇంజినీరింగ్ అండ్ సర్వీసెస్, పవర్, సోలార్ ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కకు మించి టాటా గ్రూప్ కంపెనీలు వ్యాపారాల్లో ముందువరుసలో ఉన్నాయి. కొంత కాలం కిందట ఐఫోన్ల తయారీలోకి కూడా ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిని మరింత విస్తరించేందుకు మరో పెద్ద ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు చెన్నైలో ఉన్న ఐఫోన్ ప్లాంట్‌ను తమ సొంతం చేసుకునేందుకు.. తైవాన్ దిగ్గజ సంస్థ పెగట్రాన్‌తో టాటాలు ఇప్పుడు ఒక ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఇదివరకే.. తమ తయారీ కార్యకలాపాల్ని చైనా నుంచి ఇతర దేశాలకు మళ్లించేందుకు.. ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్.. ప్రత్యామ్నాయంగా భారత్‌ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తైవాన్‌కు చెందిన కాంట్రాక్ట్ తయారీ సంస్థ పెగట్రాన్.. భారత్‌లో యాపిల్ ఐఫోన్లు రూపొందించేందుకు చెన్నైలో ఒక ప్లాంట్ నిర్మించింది. ఇప్పుడు అదే ప్లాంట్‌లో మెజారిటీ వాటాను దక్కించుకునేందుకు టాటా గ్రూప్ సబ్సిడరీ టాటా ఎలక్ట్రానిక్స్.. పెగట్రాన్‌తో ఒప్పందం చేసుకోవడంతో పాటుగా.. జాయింట్ వెంచర్ నెలకొల్పుతున్నట్లు రాయిటర్స్ పేర్కొంది. ఆ ప్లాంట్‌లో 60 శాతం వాటాను సొంతం చేసుకుంటున్న టాటా. రోజువారీగా కార్యకపాలాల్ని పర్యవేక్షిస్తుందని.. ఇక 40 శాతం వాటా ఉండే పెగట్రాన్ ఇతర కార్యకలాపాలు నిర్వహించడంతో పాటుగా.. సాంకేతిక మద్దతు అందిస్తుందని తెలుస్తోంది. మనదేశంలో ఇప్పుడు టాటాలు మినహాయిస్తే.. ఫాక్స్‌కాన్ మాత్రమే ఐఫోన్లు తయారు చేస్తుంది. కిందటేడాది ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ల సరఫరాలో మనదేశ వాటా 12-14 శాతంగా ఉండగా.. ఈ సంవత్సరం అది దాదాపు రెట్టింపు అవుతుందనే అంచనాలున్నాయి.
Like
Love
4
0 Commentarios 0 Acciones 155 Views 0 Vista previa