తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ములుగు కేంద్రంగా రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు హడలిపోయారు. చివరి సారిగా 1969లో రిక్టర్ స్కేల్‌పై 5.7 తీవ్రతతో భూకంపం రాగా.. తాజాగా దాదాపు అంతే తీవ్రతతో భూకంపం సంభవించింది.

ప్రధానాంశాలు:

తెలంగాణలో భూకంపం
రిక్టర్ స్కేల్‌లో 5.3గా తీవ్రత
భూకంపంతో హడలిపోయిన ప్రజలు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం భూకంపం సంభవించింది. ఉదయం 7.25 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక.. ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెలంగాణలో హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాలతో పాటుగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, చెన్నారావుపేట మండల కేంద్రంలో భూమి కంపించింది. ఏపీలోని ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలోనూ స్వల్పంగా భూమి కంపించింది.
తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ములుగు కేంద్రంగా రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు హడలిపోయారు. చివరి సారిగా 1969లో రిక్టర్ స్కేల్‌పై 5.7 తీవ్రతతో భూకంపం రాగా.. తాజాగా దాదాపు అంతే తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రధానాంశాలు: తెలంగాణలో భూకంపం రిక్టర్ స్కేల్‌లో 5.3గా తీవ్రత భూకంపంతో హడలిపోయిన ప్రజలు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం భూకంపం సంభవించింది. ఉదయం 7.25 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక.. ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెలంగాణలో హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాలతో పాటుగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, చెన్నారావుపేట మండల కేంద్రంలో భూమి కంపించింది. ఏపీలోని ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలోనూ స్వల్పంగా భూమి కంపించింది.
Like
Sad
4
0 Commentaires 0 Parts 121 Vue 0 Aperçu