టమాటా రైతులకు రిలీఫ్.. ప్రభుత్వం కీలక ఆదేశాలు.
ఒకప్పుడు కేజీ వంద రూపాయలు పలికిన టమాటా.. ఇప్పడు రైతులకు కన్నీరు తెప్పిస్తోంది. కేజీ రూపాయి కూడా పలకని పరిస్థితుల్లో అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రోడ్డు మీద పారబోసుకుంటున్న పరిస్థితి. టమాటా అంటే ఠక్కున గుర్తొచ్చేది ఏపీలోని మదనపల్లె, పత్తికొండ మార్కెట్లు. ఈ మార్కెట్ల వద్ద ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. టమాటా రేటు భారీగా పతనమైన పరిస్థితిలో రైతులకు ఊరటనిచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు పత్తికొండ మార్కెట్ యార్డులో టమాటా కిలో రూపాయి అంటూ వచ్చిన కథనాలపై స్పందించి.. కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

కర్నూలు పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధర పతనంపై మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. లాభ నష్టాలు లేకుండా కిలో టమాటా 8 రూపాయలకే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పత్తికొండ మార్కెట్ యార్డులో కొనుగోలు చేసిన టమాటాను.. రాష్ట్రంలోని మార్కెట్లలో అదే ధరకు విక్రయించాలని స్పష్టం చేశారు. లాభం, నష్టంతో సంబంధం లేదని టమాటా రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అచ్చెన్నాయుడు తెలిపారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి పెరగడం, నాసిరకం టమాటా కారణంగా ధరలపై ప్రభావం పడిందని అధికారులు మంత్రికి తెలియజేశారు. దీంతో రైతులకు, ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా కేజీ 8 రూపాయలకు టమాటాను కొనుగోలు చేసి మార్కెట్లలో విక్రయించాలని మార్కెటింగ్ శాఖ అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.
టమాటా రైతులకు రిలీఫ్.. ప్రభుత్వం కీలక ఆదేశాలు. ఒకప్పుడు కేజీ వంద రూపాయలు పలికిన టమాటా.. ఇప్పడు రైతులకు కన్నీరు తెప్పిస్తోంది. కేజీ రూపాయి కూడా పలకని పరిస్థితుల్లో అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రోడ్డు మీద పారబోసుకుంటున్న పరిస్థితి. టమాటా అంటే ఠక్కున గుర్తొచ్చేది ఏపీలోని మదనపల్లె, పత్తికొండ మార్కెట్లు. ఈ మార్కెట్ల వద్ద ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. టమాటా రేటు భారీగా పతనమైన పరిస్థితిలో రైతులకు ఊరటనిచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు పత్తికొండ మార్కెట్ యార్డులో టమాటా కిలో రూపాయి అంటూ వచ్చిన కథనాలపై స్పందించి.. కీలక ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధర పతనంపై మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. లాభ నష్టాలు లేకుండా కిలో టమాటా 8 రూపాయలకే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పత్తికొండ మార్కెట్ యార్డులో కొనుగోలు చేసిన టమాటాను.. రాష్ట్రంలోని మార్కెట్లలో అదే ధరకు విక్రయించాలని స్పష్టం చేశారు. లాభం, నష్టంతో సంబంధం లేదని టమాటా రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అచ్చెన్నాయుడు తెలిపారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి పెరగడం, నాసిరకం టమాటా కారణంగా ధరలపై ప్రభావం పడిందని అధికారులు మంత్రికి తెలియజేశారు. దీంతో రైతులకు, ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా కేజీ 8 రూపాయలకు టమాటాను కొనుగోలు చేసి మార్కెట్లలో విక్రయించాలని మార్కెటింగ్ శాఖ అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.
Like
Love
3
0 Reacties 0 aandelen 141 Views 0 voorbeeld