Allu Arjun Arrest: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ‌వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఓ జాతీయ స్థాయి అవార్డు అందుకున్న నటుడ్ని తొక్కిసలాట కేసులో అరెస్ట్ చేయడం, నలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచడం అంతా చకచక జరిగిపోయాయి. బన్నీ అరెస్ట్ వ్యవహారం అటు తిప్పి ఇటు తిప్పి రాజకీయ రంగు పులుముకుంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనిపై ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ..ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని చెప్పినట్లుగా తెలుస్తోంది.చట్టం ముందు అందరూ సమానమేనని.. ఇప్పుడు బన్నీ అరెస్ట్ విషయంలో కూడా చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోయారు కాబట్టే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు సీఎం. ఇక మరో సినీ సెలబ్రిటీ మోహన్ బాబు మీడియాపై దాడి చేసిన కేసులో కూడా కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి ఎలాంచి చర్యలు తీసుకోవడం లేదని చెప్పకనే చెప్పారు.అయితే మరో 24గంటల తర్వాత మంచు ఫ్యామిలీలో కూడా అరెస్టులు ఉండే అవకాశం కనిపిస్తోంది.

Like
Love
3
0 Reacties 0 aandelen 124 Views 0 voorbeeld