RBI: ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. థర్డ్‌ పార్టీ యాప్స్‌తో చెల్లింపులకు గ్రీన్‌ సిగ్నల్‌!
RBI: ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ హోల్డర్‌లను థర్డ్ పార్టీ మొబైల్ అప్లికేషన్‌ల ద్వారా UPI చెల్లింపులు చేయడానికి, స్వీకరించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం అనుమతి ఇచ్చింది. థర్డ్-పార్టీ UPI అప్లికేషన్‌లపై పూర్తి-KYCకి లోబడి ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల నుండి UPI చెల్లింపులను ప్రారంభించాలని నిర్ణయించినట్లు సెంట్రల్ బ్యాంక్ సర్క్యులర్‌లో తెలిపింది..
యూపీఐ లావాదేవీల విషయంలో భారత్‌ దూసుకుపోతోంది. రోజురోజుకు యూపీఐ చెల్లింపు వ్యవస్థ మరింత మెరుగు పడుతోంది. ఈ యూపీఐ చెల్లింపుల విధానంలో ఆర్బీఐ కీలక మార్పులు చేసింది. ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (PPI)లను అందిస్తున్న కంపెనీల వాలెట్లలో ఉన్న మొత్తాన్ని ఇక నుంచి థర్డ్‌ పార్టీ మొబైల్‌ అప్లికేషన్లను వినియోగించి చెల్లింపులు చేసుకునే విధానం మార్పులు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆర్బీఐ ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. కేవైసీ చేసుకున్న వినియోగదారులు ఈ థర్డ్‌ పార్టీ యాప్స్‌ నుంచి లావాదేవీలు చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.

సాధారణంగా కొంత డబ్బును ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల్లో (PPIలు) ముందుగా డిపాజిట్ చేయవచ్చు. వాటిని వాలెట్లు లేదా ప్రీపెయిడ్ కార్డులు అని పిలుస్తారు. మీరు వాటి ద్వారా UPI, ఆన్‌లైన్ లావాదేవీలకు చెల్లింపులు చేయవచ్చు. మీ బ్యాంక్ ఖాతాతో సంబంధం లేకుండా PPI డబ్బును ఖర్చు చేసుకునే వెలుసుబాటు ఉంటుంది. ప్రస్తుతానికి, ఈ చెల్లింపులను పీపీఐ ప్రొవైడర్ నుండి యూపీఐ ద్వారా చేయవచ్చు. ఇప్పటి నుండి ఈ పీపీఐలను ఏదైనా యూపీఐ యాప్‌కి లింక్ చేసుకుని లావాదేవీలు జరుపుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.
RBI: ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. థర్డ్‌ పార్టీ యాప్స్‌తో చెల్లింపులకు గ్రీన్‌ సిగ్నల్‌! RBI: ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ హోల్డర్‌లను థర్డ్ పార్టీ మొబైల్ అప్లికేషన్‌ల ద్వారా UPI చెల్లింపులు చేయడానికి, స్వీకరించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం అనుమతి ఇచ్చింది. థర్డ్-పార్టీ UPI అప్లికేషన్‌లపై పూర్తి-KYCకి లోబడి ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల నుండి UPI చెల్లింపులను ప్రారంభించాలని నిర్ణయించినట్లు సెంట్రల్ బ్యాంక్ సర్క్యులర్‌లో తెలిపింది.. యూపీఐ లావాదేవీల విషయంలో భారత్‌ దూసుకుపోతోంది. రోజురోజుకు యూపీఐ చెల్లింపు వ్యవస్థ మరింత మెరుగు పడుతోంది. ఈ యూపీఐ చెల్లింపుల విధానంలో ఆర్బీఐ కీలక మార్పులు చేసింది. ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (PPI)లను అందిస్తున్న కంపెనీల వాలెట్లలో ఉన్న మొత్తాన్ని ఇక నుంచి థర్డ్‌ పార్టీ మొబైల్‌ అప్లికేషన్లను వినియోగించి చెల్లింపులు చేసుకునే విధానం మార్పులు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆర్బీఐ ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. కేవైసీ చేసుకున్న వినియోగదారులు ఈ థర్డ్‌ పార్టీ యాప్స్‌ నుంచి లావాదేవీలు చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. సాధారణంగా కొంత డబ్బును ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల్లో (PPIలు) ముందుగా డిపాజిట్ చేయవచ్చు. వాటిని వాలెట్లు లేదా ప్రీపెయిడ్ కార్డులు అని పిలుస్తారు. మీరు వాటి ద్వారా UPI, ఆన్‌లైన్ లావాదేవీలకు చెల్లింపులు చేయవచ్చు. మీ బ్యాంక్ ఖాతాతో సంబంధం లేకుండా PPI డబ్బును ఖర్చు చేసుకునే వెలుసుబాటు ఉంటుంది. ప్రస్తుతానికి, ఈ చెల్లింపులను పీపీఐ ప్రొవైడర్ నుండి యూపీఐ ద్వారా చేయవచ్చు. ఇప్పటి నుండి ఈ పీపీఐలను ఏదైనా యూపీఐ యాప్‌కి లింక్ చేసుకుని లావాదేవీలు జరుపుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.
Like
Love
4
0 Comments 0 Shares 118 Views 0 Reviews