Vodafone Idea 5G launch in India : యూజర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ప్రముఖ టెలికాం సంస్థ వోడాఫోన్‌ ఐడియా (Vi) ఎట్టకేలకు 5G సర్వీసులను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్‌లో ఎంపిక చేసిన సర్కిళ్లలో ఈ 5G నెట్‌వర్క్‌ను లాంచ్‌ చేసింది. భారత్‌ టెలికాం మార్కెట్‌లో జియో, ఎయిర్‌టెల్‌ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. వోడాఫోన్‌ ఐడియా మూడో స్థానంలో ఉంది. అయితే జియో, ఎయిర్‌టెల్‌ ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాంతాల్లో 5G సర్వీసులను అందిస్తోంది. ఈ క్రమంలో తాజాగా వోడాఫోన్‌ ఐడియా (Vi) కూడా భారత్‌లోని 17 టెలికాం సర్కిళ్లలో ఈ 5G నెట్‌వర్క్‌ను (Vodafone idea 5G) ప్రారంభించింది.

దేశ రాజధాని ఢిల్లీలోని ఓక్లా ఇండస్ట్రియల్‌ ఏరియా ఫేజ్‌ 2, ఇండియా గేట్‌, ప్రగతి మైదాన్‌, తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో వోడాఫోన్‌ ఐడియా (Vi) 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటితోపాటు మహారాష్ట్రలోని పూణే - శివాజీనగర్‌, చెన్నైలోని - పెరుంగుడి, నేసపాక్కమ్‌, పంజాబ్‌లోని జలంధరలోని కొన్ని ప్రాంతాలు, బెంగళూరు డైరీ సర్కిల్‌, ముంబైలోని వర్లీ, మరోల్‌ అంధేరీ ఈస్ట్‌, బీహార్‌ రాష్ట్రంలోని పాట్నా- అనిషాబాద్ గోలంబార్‌, పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి- సిటీ ప్లాజా సెవోక్ రోడ్‌, కోల్‌కతా సెక్టార్‌ 5, సాల్ట్‌ లేక్‌తోపాటు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ - పరదేశీపురం, ఎలక్ట్రానిక్స్‌ కాంప్లెక్స్‌, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ - కార్పొరేట్ రోడ్‌, మకర్బా, ప్రహ్లాద్‌ నగర్‌, హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌ - ఇండస్ట్రియల్ ఏరియా, సెక్టార్‌ 3 వంటి సర్కిళ్లలో వోడాఫోన్‌ ఐడియా (Vi) 5G నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చింది.
Vodafone Idea 5G launch in India : యూజర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ప్రముఖ టెలికాం సంస్థ వోడాఫోన్‌ ఐడియా (Vi) ఎట్టకేలకు 5G సర్వీసులను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్‌లో ఎంపిక చేసిన సర్కిళ్లలో ఈ 5G నెట్‌వర్క్‌ను లాంచ్‌ చేసింది. భారత్‌ టెలికాం మార్కెట్‌లో జియో, ఎయిర్‌టెల్‌ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. వోడాఫోన్‌ ఐడియా మూడో స్థానంలో ఉంది. అయితే జియో, ఎయిర్‌టెల్‌ ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాంతాల్లో 5G సర్వీసులను అందిస్తోంది. ఈ క్రమంలో తాజాగా వోడాఫోన్‌ ఐడియా (Vi) కూడా భారత్‌లోని 17 టెలికాం సర్కిళ్లలో ఈ 5G నెట్‌వర్క్‌ను (Vodafone idea 5G) ప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఓక్లా ఇండస్ట్రియల్‌ ఏరియా ఫేజ్‌ 2, ఇండియా గేట్‌, ప్రగతి మైదాన్‌, తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో వోడాఫోన్‌ ఐడియా (Vi) 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటితోపాటు మహారాష్ట్రలోని పూణే - శివాజీనగర్‌, చెన్నైలోని - పెరుంగుడి, నేసపాక్కమ్‌, పంజాబ్‌లోని జలంధరలోని కొన్ని ప్రాంతాలు, బెంగళూరు డైరీ సర్కిల్‌, ముంబైలోని వర్లీ, మరోల్‌ అంధేరీ ఈస్ట్‌, బీహార్‌ రాష్ట్రంలోని పాట్నా- అనిషాబాద్ గోలంబార్‌, పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి- సిటీ ప్లాజా సెవోక్ రోడ్‌, కోల్‌కతా సెక్టార్‌ 5, సాల్ట్‌ లేక్‌తోపాటు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ - పరదేశీపురం, ఎలక్ట్రానిక్స్‌ కాంప్లెక్స్‌, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ - కార్పొరేట్ రోడ్‌, మకర్బా, ప్రహ్లాద్‌ నగర్‌, హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌ - ఇండస్ట్రియల్ ఏరియా, సెక్టార్‌ 3 వంటి సర్కిళ్లలో వోడాఫోన్‌ ఐడియా (Vi) 5G నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చింది.
Like
3
0 Σχόλια 0 Μοιράστηκε 77 Views 0 Προεπισκόπηση