AP Inter 1st Year Exams News : ఆ వార్తలు నమ్మొద్దు.. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు రద్దు ప్రచారం అబద్ధం.. స్పష్టత ఇచ్చిన బోర్డు.

AP Inter 1st Year Exams News : ఇవాళ (జనవరి 8) ఉదయం నుంచి ఇంటర్ ఫస్టియర్‌ పరీక్షలు రద్దు అంటూ ప్రసారమైన వార్తలపై ఏపీ ఇంటర్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు అంటూ జరగుతున్న ప్రచారం అబద్ధమని స్పష్టం చేసింది. ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి కొన్ని సంస్కరణలను తీసుకువచ్చే విషయమై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల సలహాలను మాత్రమే కోరడం జరిగిందని పేర్కొంది. ప్రజలు తమ సూచనలను జనవరి 26, 2025 లోపు biereforms@gmail.com కు మెయిల్ చేయాలని సూచించింది. ప్రతిపాదిత సంస్కరణల విధానాలు http://bieap.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. కాబట్టి ప్రజలెవరూ ఇలాంటి వదంతులను నమ్మొద్దని కోరింది.
AP Inter 1st Year Exams News : ఆ వార్తలు నమ్మొద్దు.. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు రద్దు ప్రచారం అబద్ధం.. స్పష్టత ఇచ్చిన బోర్డు. AP Inter 1st Year Exams News : ఇవాళ (జనవరి 8) ఉదయం నుంచి ఇంటర్ ఫస్టియర్‌ పరీక్షలు రద్దు అంటూ ప్రసారమైన వార్తలపై ఏపీ ఇంటర్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు అంటూ జరగుతున్న ప్రచారం అబద్ధమని స్పష్టం చేసింది. ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి కొన్ని సంస్కరణలను తీసుకువచ్చే విషయమై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల సలహాలను మాత్రమే కోరడం జరిగిందని పేర్కొంది. ప్రజలు తమ సూచనలను జనవరి 26, 2025 లోపు biereforms@gmail.com కు మెయిల్ చేయాలని సూచించింది. ప్రతిపాదిత సంస్కరణల విధానాలు http://bieap.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. కాబట్టి ప్రజలెవరూ ఇలాంటి వదంతులను నమ్మొద్దని కోరింది.
Like
3
0 Comments 0 Shares 34 Views 0 Reviews