త్రివేణి సంగమం వద్ద పళ్ల పుల్లల బిజినెస్:
ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని అంటారు. ఇక్కడ ఒక యువకుడికి.. కాదు కాదు.. అతని గర్ల్ ఫ్రెండ్‌కు వచ్చిన ఐడియా ఇప్పుడు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కుంభమేళా జరిగినన్ని రోజులు నిత్యం లక్షలాది మంది పవిత్ర త్రివేణి సంగమంలో స్నానమాచరించడానికి వస్తుంటారు. కుంభమేళకు దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా వేశారు. యూపీ ప్రభుత్వం ఈ కుంభమేళ ద్వారా ఖజానాకు ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పింది. అనేక మంది చిరు వ్యాపారులు కుంభమేళకు వచ్చే భక్తుల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే యూపీకి చెందిన ఒక యువకుడికి అతని గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన ఐడియాతో రోజుకు రూ.40వేలు సంపాదిస్తున్నాడట. ఇంతకు అతను ఏం చేస్తున్నాడంటే.. త్రివేణి సంగమం వద్ద రోజూ ఉదయాన్నే పళ్ల పుల్లలు అమ్ముతున్నాడు. వేప, ఇతర చెట్ల కొమ్మలను కట్ చేసి.. కుంభమేళ వద్ద విక్రయిస్తూ.. రోజుకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు సంపాదిస్తున్నట్లు తెలిపాడు.

ఒక యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్ కుంభమేళాలో తిరుగుతుండగా పళ్ల పుల్లలు అమ్ముతూ ఈ యువకుడు కనపడ్డాడు. ఈ ఐడియా ఎలా వచ్చింది, ఎంత సంపాదిస్తున్నావని సదరు యువకుడిని ప్రశ్నించాడు. కుంభమేళాలో ఏదైనా ఒక వ్యాపారం చేయాలని భావించాను. అయితే పెట్టుబడి పెట్టి నష్టపోవడం కంటే.. ఎలాంటి పెట్టుబడి లేని పళ్ల పుల్లలు అమ్మమని తన గర్ల్ ఫ్రెండ్ ఐడియా ఇచ్చిందని చెప్పాడు. పగటి పూట చెట్ల కొమ్మలను నీట్‌గా కట్ చేసుకొని.. త్రివేణి సంగమం ప్రాంతంలో ఉదయం పూట విక్రయిస్తున్నానని.. ఎలాంటి పెట్టుబడి లేకుండానే భారీగా సంపాదిస్తున్నట్లు ఆ యువకుడు తెలిపారు. ఆ యువకుడి గర్ల్ ఫ్రెండ్ తెలివికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
త్రివేణి సంగమం వద్ద పళ్ల పుల్లల బిజినెస్: ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని అంటారు. ఇక్కడ ఒక యువకుడికి.. కాదు కాదు.. అతని గర్ల్ ఫ్రెండ్‌కు వచ్చిన ఐడియా ఇప్పుడు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కుంభమేళా జరిగినన్ని రోజులు నిత్యం లక్షలాది మంది పవిత్ర త్రివేణి సంగమంలో స్నానమాచరించడానికి వస్తుంటారు. కుంభమేళకు దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా వేశారు. యూపీ ప్రభుత్వం ఈ కుంభమేళ ద్వారా ఖజానాకు ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పింది. అనేక మంది చిరు వ్యాపారులు కుంభమేళకు వచ్చే భక్తుల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే యూపీకి చెందిన ఒక యువకుడికి అతని గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన ఐడియాతో రోజుకు రూ.40వేలు సంపాదిస్తున్నాడట. ఇంతకు అతను ఏం చేస్తున్నాడంటే.. త్రివేణి సంగమం వద్ద రోజూ ఉదయాన్నే పళ్ల పుల్లలు అమ్ముతున్నాడు. వేప, ఇతర చెట్ల కొమ్మలను కట్ చేసి.. కుంభమేళ వద్ద విక్రయిస్తూ.. రోజుకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు సంపాదిస్తున్నట్లు తెలిపాడు. ఒక యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్ కుంభమేళాలో తిరుగుతుండగా పళ్ల పుల్లలు అమ్ముతూ ఈ యువకుడు కనపడ్డాడు. ఈ ఐడియా ఎలా వచ్చింది, ఎంత సంపాదిస్తున్నావని సదరు యువకుడిని ప్రశ్నించాడు. కుంభమేళాలో ఏదైనా ఒక వ్యాపారం చేయాలని భావించాను. అయితే పెట్టుబడి పెట్టి నష్టపోవడం కంటే.. ఎలాంటి పెట్టుబడి లేని పళ్ల పుల్లలు అమ్మమని తన గర్ల్ ఫ్రెండ్ ఐడియా ఇచ్చిందని చెప్పాడు. పగటి పూట చెట్ల కొమ్మలను నీట్‌గా కట్ చేసుకొని.. త్రివేణి సంగమం ప్రాంతంలో ఉదయం పూట విక్రయిస్తున్నానని.. ఎలాంటి పెట్టుబడి లేకుండానే భారీగా సంపాదిస్తున్నట్లు ఆ యువకుడు తెలిపారు. ఆ యువకుడి గర్ల్ ఫ్రెండ్ తెలివికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Like
3
0 Commenti 0 condivisioni 86 Views 0 Anteprima