• KTR to ACB: ఏసీబీ ముందుకు కేటీఆర్.. అర పైసా అవినీతి జరగలేదని వ్యాఖ్య:

    మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం 9:30కి నంది నగర్ ఇంటి నుంచి ఆయన బయలుదేరారు. ఉదయం 10.15 తర్వాత బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనకు ఏసీబీతోపాటూ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణకు పిలుస్తూ నోటీస్ ఇచ్చింది.

    కేటీఆర్ ఏమన్నారంటే:

    తాను ఏ అవినీతికీ పాల్పడలేదనీ, అరపైసా కూడా అవినీతి జరగలేదనీ, తాను కేసీఆర్ సైనికుడిని అని కేటీఆర్ అన్నారు. ఫార్ములా-ఈ రేసులో ఎలాంటి క్విడ్ ప్రోకో జరగలేదన్నారు. తెలంగాణ ప్రతిష్టను పెంచడానికే తాను ప్రయత్నించానన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, వాటిని ఎదుర్కొంటానన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్నారు.
    కేటీఆర్‌పై ఆరోపణలు:

    ఫార్ములా-ఈ కారు రేసుకి సంబంధించి నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు కేటీఆర్ ఎదుర్కొంటున్నారు. దీనిపై ఆల్రెడీ ఓసారి ఆయన ఏసీబీ విచారణకు వచ్చారు. తనతోపాటూ లాయర్‌ని కూడా అనుమతించాలన్నారు. అందుకు ఏసీబీ ఒప్పుకోలేదు. దాంతో వెనక్కి వెళ్లిపోయిన ఆయన.. మరోసారి విచారణకు వస్తున్నారు. విచారణ తర్వాత కేటీఆర్‌ని అరెస్టు చేస్తారనే వాదన వినిపిస్తోంది. ఈ వాదనను బీఆర్ఎస్ ఖండిస్తోంది.

    హరీశ్‌రావు గృహనిర్బంధం:

    ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి హరీశ్ రావును గృహ నిర్బంధం చేశారు. హరీశ్ రావు ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
    లాయర్‌తో కేటీఆర్:
    ఇవాళ విచారణలో భాగంగా కేటీఆర్ లాయర్‌తో వెళ్లవచ్చు అని హైకోర్టు తెలిపింది. ఐతే.. విచారణను ఆడియో, వీడియో రికార్డ్ చెయ్యడానికి హైకోర్టు ఒప్పుకోలేదు. ఐతే.. లాయర్‌ని వెంటబెట్టుకొని వెళ్లొచ్చు అనేది కేటీఆర్‌కి ప్లస్ పాయింట్. దీని వల్ల ఆయన.. విచారణ సమయంలో ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనేది లాయర్ ద్వారా తెలుసుకొని, జాగ్రత్తగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఐతే.. విచారణ గదిలోకి కేటీఆర్‌ని మాత్రమే అనుమతిస్తారు. లాయర్, మరో గదిలో ఉండొచ్చు. ఇవాళ లాయర్ రామచంద్రరావు, కేటీఆర్ వెంట వెళ్తారని తెలుస్తోంది.
    ఫార్ములా-ఈ రేసు కేసేంటి?
    హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేసు సీజన్ 10 పోటీలను నిర్వహించేందుకు కేటీఆర్.. రూల్స్‌కి విరుద్ధంగా.. రూ.55 కోట్లను ఓ విదేశీ కంపెనీకి వెళ్లేలా చేశారనేది ఆరోపణ. ఇందుకు రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్, కేబినెట్ పర్మిషన్, ఆర్థిక శాఖ పర్మిషన్ తీసుకోలేదని అవినీతి నిరోధక విభాగం (ACB) చెబుతోంది. కేటీఆర్ మాటల రూపంలో చెప్పిన ఆదేశాలతోనే.. ఈ మనీ ట్రాన్స్‌ఫర్ జరిగింది అని సమాచారం. అందుకే ఈ కేసులో కేటీఆర్‌ని A1గా ఏసీబీ చెబుతోంది. ఆయనతోపాటూ మరో ఇద్దరు నిందితులు కూడా ఉన్నారు.
    KTR మాత్రం తనపై పెట్టింది అక్రమ కేసు, పొలిటికల్ మోటివేటెడ్ కేసు అంటున్నారు. ఏ విచారణను ఎదుర్కోవడానికైనా తాను సిద్ధం అన్నారు. ఆల్రెడీ ఓసారి విచారణకు వెళ్లానన్న ఆయన.. భారత పౌరుడిగా చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా తాను వ్యవహరిస్తానన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి పెడుతున్న అక్రమ కేసులను రాజ్యాంగపరంగా, న్యాయపరంగా ఎదుర్కొనేందుకు తనకు ఉన్న ప్రతి హక్కునూ ఉపయోగించుకుంటానన్నారు.
    KTR to ACB: ఏసీబీ ముందుకు కేటీఆర్.. అర పైసా అవినీతి జరగలేదని వ్యాఖ్య: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం 9:30కి నంది నగర్ ఇంటి నుంచి ఆయన బయలుదేరారు. ఉదయం 10.15 తర్వాత బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనకు ఏసీబీతోపాటూ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణకు పిలుస్తూ నోటీస్ ఇచ్చింది. కేటీఆర్ ఏమన్నారంటే: తాను ఏ అవినీతికీ పాల్పడలేదనీ, అరపైసా కూడా అవినీతి జరగలేదనీ, తాను కేసీఆర్ సైనికుడిని అని కేటీఆర్ అన్నారు. ఫార్ములా-ఈ రేసులో ఎలాంటి క్విడ్ ప్రోకో జరగలేదన్నారు. తెలంగాణ ప్రతిష్టను పెంచడానికే తాను ప్రయత్నించానన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, వాటిని ఎదుర్కొంటానన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. కేటీఆర్‌పై ఆరోపణలు: ఫార్ములా-ఈ కారు రేసుకి సంబంధించి నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు కేటీఆర్ ఎదుర్కొంటున్నారు. దీనిపై ఆల్రెడీ ఓసారి ఆయన ఏసీబీ విచారణకు వచ్చారు. తనతోపాటూ లాయర్‌ని కూడా అనుమతించాలన్నారు. అందుకు ఏసీబీ ఒప్పుకోలేదు. దాంతో వెనక్కి వెళ్లిపోయిన ఆయన.. మరోసారి విచారణకు వస్తున్నారు. విచారణ తర్వాత కేటీఆర్‌ని అరెస్టు చేస్తారనే వాదన వినిపిస్తోంది. ఈ వాదనను బీఆర్ఎస్ ఖండిస్తోంది. హరీశ్‌రావు గృహనిర్బంధం: ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి హరీశ్ రావును గృహ నిర్బంధం చేశారు. హరీశ్ రావు ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. లాయర్‌తో కేటీఆర్: ఇవాళ విచారణలో భాగంగా కేటీఆర్ లాయర్‌తో వెళ్లవచ్చు అని హైకోర్టు తెలిపింది. ఐతే.. విచారణను ఆడియో, వీడియో రికార్డ్ చెయ్యడానికి హైకోర్టు ఒప్పుకోలేదు. ఐతే.. లాయర్‌ని వెంటబెట్టుకొని వెళ్లొచ్చు అనేది కేటీఆర్‌కి ప్లస్ పాయింట్. దీని వల్ల ఆయన.. విచారణ సమయంలో ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనేది లాయర్ ద్వారా తెలుసుకొని, జాగ్రత్తగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఐతే.. విచారణ గదిలోకి కేటీఆర్‌ని మాత్రమే అనుమతిస్తారు. లాయర్, మరో గదిలో ఉండొచ్చు. ఇవాళ లాయర్ రామచంద్రరావు, కేటీఆర్ వెంట వెళ్తారని తెలుస్తోంది. ఫార్ములా-ఈ రేసు కేసేంటి? హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేసు సీజన్ 10 పోటీలను నిర్వహించేందుకు కేటీఆర్.. రూల్స్‌కి విరుద్ధంగా.. రూ.55 కోట్లను ఓ విదేశీ కంపెనీకి వెళ్లేలా చేశారనేది ఆరోపణ. ఇందుకు రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్, కేబినెట్ పర్మిషన్, ఆర్థిక శాఖ పర్మిషన్ తీసుకోలేదని అవినీతి నిరోధక విభాగం (ACB) చెబుతోంది. కేటీఆర్ మాటల రూపంలో చెప్పిన ఆదేశాలతోనే.. ఈ మనీ ట్రాన్స్‌ఫర్ జరిగింది అని సమాచారం. అందుకే ఈ కేసులో కేటీఆర్‌ని A1గా ఏసీబీ చెబుతోంది. ఆయనతోపాటూ మరో ఇద్దరు నిందితులు కూడా ఉన్నారు. KTR మాత్రం తనపై పెట్టింది అక్రమ కేసు, పొలిటికల్ మోటివేటెడ్ కేసు అంటున్నారు. ఏ విచారణను ఎదుర్కోవడానికైనా తాను సిద్ధం అన్నారు. ఆల్రెడీ ఓసారి విచారణకు వెళ్లానన్న ఆయన.. భారత పౌరుడిగా చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా తాను వ్యవహరిస్తానన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి పెడుతున్న అక్రమ కేసులను రాజ్యాంగపరంగా, న్యాయపరంగా ఎదుర్కొనేందుకు తనకు ఉన్న ప్రతి హక్కునూ ఉపయోగించుకుంటానన్నారు.
    Like
    3
    0 Commentaires 0 Parts 90 Vue 0 Aperçu
  • ఢిల్లీలో కేటీఆర్‌ ప్రెస్‌మీట్‌. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌ నేతలు. లగచర్ల కేసులో అరెస్టై జైలులో ఉన్న వారి కుటుంబాలతో కలిసి ఢిల్లీ వెళ్లిన బీఆర్‌ఎస్‌ నేతలు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని NHRCకి వినతి.

    #BreakingNews‌ #TeluguNews #TelanganaNews #NHRC #KTR
    ఢిల్లీలో కేటీఆర్‌ ప్రెస్‌మీట్‌. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌ నేతలు. లగచర్ల కేసులో అరెస్టై జైలులో ఉన్న వారి కుటుంబాలతో కలిసి ఢిల్లీ వెళ్లిన బీఆర్‌ఎస్‌ నేతలు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని NHRCకి వినతి. #BreakingNews‌ #TeluguNews #TelanganaNews #NHRC #KTR
    Like
    Love
    4
    0 Commentaires 0 Parts 749 Vue 0 Aperçu