Directory
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
-
-
-
-
-
-
-
NH-563: శరవేగంగా నేషనల్ హైవే పనులు.. ఇక ఆ రూట్‌లో ప్రయాణించేవారికి నో టెన్షన్;
NH-563: కేంద్ర ప్రభుత్వం భారత మాల యోజన కింద.. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిని పునర్నిర్మాణం చేస్తోంది. ఇప్పటివరకు ఉన్న రోడ్డును ఫోర్ లైన్ రోడ్డుగా విస్తరిస్తున్నారు. 68 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ కరీంనగర్-వరంగల్ నేషనల్ హైవే(ఎన్‌హెచ్-563) నిర్మాణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,146 కోట్లు కేటాయించింది. ఇక ఈ ఎన్‌హెచ్-563 కోసం ఇప్పటికే 325.125 హెక్టార్ల భూమిని సేకరించారు. కరీంనగర్ మండలం ఇరుకుల్ల, దుర్శేడ్ శివారులో బొమ్మకల్ మానేరు వాగు మీదుగా మానకొండూర్ వరకు రహదారి పనులు విస్తృతంగా జరుగుతున్నాయి.
ఇక ఈ ఎన్‌హెచ్-563 నిర్మాణ పనుల్లో భాగంగా మొత్తం 28 వెహికిల్ అండర్ పాస్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. అదే విధంగా ఇరుకుల్ల, మానేరు సహా పలు వాగులపై మొత్తం 9 మేజర్ వంతెనలను కట్టనున్నారు. బొమ్మకల్ మానేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఇరుకుల్ల వాగుపై 250 మీటర్లు.. మానేరు వాగుపై 562 మీటర్ల పొడవుతో బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. ఇరుకుల్ల గ్రామ ప్రధాన రహదారిపై ఫై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాహనాలను మళ్లించేందుకు తాత్కాలికంగా రోడ్డును సిద్ధం చేస్తున్నారు.
ఇక ఈ కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి నిర్మాణానికి 2 ఏళ్ల క్రితమే అధికారులు భూసేకరణ చేపట్టారు. అయితే ప్రస్తుతం నేషనల్ హైవే పనులు జరుగుతున్నా తమకు ఇంకా పరిహారం అందించడం లేదని స్థానికంగా ఉన్న రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ మండలంలోని భూసేకరణ చేసిన గ్రామాల్లో దుర్శేడ్, ఇరుకుల్ల, ఎలబోతారం, నగునూర్, జూబ్లీనగర్ గ్రామాల్లోని రైతుల నుంచి వారు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములను ఈ జాతీయ రహదారి కోసం సేకరించారు.
ఇరుకుల్లలో పూర్తిస్థాయిలో పరిహారం అందించినప్పటికీ.. రహదారి నిర్మాణంలో భాగంగా కోల్పోయిన బావులకు ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదని స్థానికులు వాపోతున్నారు. ఇక ఎలబోతారం, నగునూర్, జూబ్లీనగర్ గ్రామాల్లో కొంతమంది నుంచి 15 రోజుల క్రితం సంతకాలు తీసుకున్న అధికారులు ఇప్పటికీ డబ్బులు వేయలేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఇరుకుల్ల నుంచి ఎలబోతారం, జూబ్లీనగర్‌కు రహదారి పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో తమకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించిన తర్వాతే చేపట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు.NH-563: శరవేగంగా నేషనల్ హైవే పనులు.. ఇక ఆ రూట్‌లో ప్రయాణించేవారికి నో టెన్షన్; NH-563: కేంద్ర ప్రభుత్వం భారత మాల యోజన కింద.. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిని పునర్నిర్మాణం చేస్తోంది. ఇప్పటివరకు ఉన్న రోడ్డును ఫోర్ లైన్ రోడ్డుగా విస్తరిస్తున్నారు. 68 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ కరీంనగర్-వరంగల్ నేషనల్ హైవే(ఎన్‌హెచ్-563) నిర్మాణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,146 కోట్లు కేటాయించింది. ఇక ఈ ఎన్‌హెచ్-563 కోసం ఇప్పటికే 325.125 హెక్టార్ల భూమిని సేకరించారు. కరీంనగర్ మండలం ఇరుకుల్ల, దుర్శేడ్ శివారులో బొమ్మకల్ మానేరు వాగు మీదుగా మానకొండూర్ వరకు రహదారి పనులు విస్తృతంగా జరుగుతున్నాయి. ఇక ఈ ఎన్‌హెచ్-563 నిర్మాణ పనుల్లో భాగంగా మొత్తం 28 వెహికిల్ అండర్ పాస్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. అదే విధంగా ఇరుకుల్ల, మానేరు సహా పలు వాగులపై మొత్తం 9 మేజర్ వంతెనలను కట్టనున్నారు. బొమ్మకల్ మానేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఇరుకుల్ల వాగుపై 250 మీటర్లు.. మానేరు వాగుపై 562 మీటర్ల పొడవుతో బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. ఇరుకుల్ల గ్రామ ప్రధాన రహదారిపై ఫై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాహనాలను మళ్లించేందుకు తాత్కాలికంగా రోడ్డును సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి నిర్మాణానికి 2 ఏళ్ల క్రితమే అధికారులు భూసేకరణ చేపట్టారు. అయితే ప్రస్తుతం నేషనల్ హైవే పనులు జరుగుతున్నా తమకు ఇంకా పరిహారం అందించడం లేదని స్థానికంగా ఉన్న రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ మండలంలోని భూసేకరణ చేసిన గ్రామాల్లో దుర్శేడ్, ఇరుకుల్ల, ఎలబోతారం, నగునూర్, జూబ్లీనగర్ గ్రామాల్లోని రైతుల నుంచి వారు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములను ఈ జాతీయ రహదారి కోసం సేకరించారు. ఇరుకుల్లలో పూర్తిస్థాయిలో పరిహారం అందించినప్పటికీ.. రహదారి నిర్మాణంలో భాగంగా కోల్పోయిన బావులకు ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదని స్థానికులు వాపోతున్నారు. ఇక ఎలబోతారం, నగునూర్, జూబ్లీనగర్ గ్రామాల్లో కొంతమంది నుంచి 15 రోజుల క్రితం సంతకాలు తీసుకున్న అధికారులు ఇప్పటికీ డబ్బులు వేయలేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఇరుకుల్ల నుంచి ఎలబోతారం, జూబ్లీనగర్‌కు రహదారి పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో తమకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించిన తర్వాతే చేపట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు. -
తెలంగాణకు స్మార్ట్ షూ కంపెనీ.. 87 వేల మందికి ఉపాధి..!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొరియన్ స్మార్ట్ షూ కంపెనీ షూఆల్స్ ఛైర్మన్ చెవోంగ్ లీ ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో 300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అందుకు 750 ఎకరాల భూముని కేటాయించాలని కోరారు. లీ ప్రాతిపాదనపై మంత్రి సానుకూలంగా స్పందించారు
తెలంగాణలో ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో వ్యాపార అనుకూల వాతావరణం ఉండటంతో చాలా కంపెనీలు క్యూ కడుతున్నాయి. తాజాగా.. మరో అంతర్జాతీయ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. మెడికల్, స్మార్ట్ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న షూఆల్స్ కొరియన్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. ఈ మేరకు షూఆల్స్ ఛైర్మన్ చెవోంగ్ లీతో పాటు కంపెనీ ప్రతినిధులు, తెలంగాణ ఐటీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు.
రాష్ట్రంలో 750 ఎకరాలు కేటాయిస్తే రూ.300 కోట్లతో స్మార్ట్ షూ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామని షూ ఆల్స్ ప్రతినిధులు మంత్రిని కోరారు. ఈ కంపెనీ ద్వారా 87 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. ఈ మేరకు గిగా ఫ్యాక్టరీ ప్రతిపాదనను మంత్రి ముందు ఉంచారు. షూ అడుగు భాగాన (సోల్స్) మెడికల్ చిప్ ఉండే బూట్లు తయారు చేస్తామని.. పది వేల అడుగులు వేస్తే గంటకు 25 వాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందన్నారు. డయాబెటీస్, ఆర్థరైటిస్ ఉన్న వారికి ఈ స్మార్ట్ షూ ద్వారా ఉపశమనం కలుగుతుందని చెప్పారు.
తమ కంపెనీ ఉత్పత్తుల తయారీ కోసం తెలంగాణలో 750 ఎకరాల భూమి అవసరమవుతుందని చెప్పారు. షూ కంపెనీ ప్రతినిధుల ప్రతిపాదనకు మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారు. షూఆల్స్ అభ్యర్థన అత్యంత ప్రాధాన్యమైనదిగా భావించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారీ షూ కంపెనీ తెలంగాణలో నెలకొల్పి ఇక్కడి నుంచే దేశీయ అవసరాలకు, అమెరికాతో పాటు ప్రపంచ మార్కెట్లకు స్మార్ట్ షూ సరఫరా చేస్తారని వివరించారు. షూ తయారీలో జంతువుల చర్మాన్ని వినియోగించడం వల్ల ఇక్కడ ట్యానరీలు అవసరమవుతాయని చెప్పారు. ఇలా యాన్సిల్లరీ పరిశ్రమలతో అనేక తెలంగాణలో వేల మందికి ఉపాధి దొరుకుంన్నారు. ప్రపంచ మార్కెట్లకు తెలంగాణ ఒక హబ్‌గా మారుతుందని వెల్లడించారు.
ఇక స్మార్ట్ హెల్త్ సిటీ ఏర్పాటుతో లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని మంత్రి శ్రీధర్ వెల్లడించారు. తెలంగాణలోని టైర్ II, టైర్ III నగరాల్లో ఏర్పాటు చేసే పక్షంలో ఈ ప్రతిపాదనను తాము పరిశీలిస్తామని చెప్పినట్లు వెల్లడించారు.తెలంగాణకు స్మార్ట్ షూ కంపెనీ.. 87 వేల మందికి ఉపాధి..! తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొరియన్ స్మార్ట్ షూ కంపెనీ షూఆల్స్ ఛైర్మన్ చెవోంగ్ లీ ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో 300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అందుకు 750 ఎకరాల భూముని కేటాయించాలని కోరారు. లీ ప్రాతిపాదనపై మంత్రి సానుకూలంగా స్పందించారు తెలంగాణలో ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో వ్యాపార అనుకూల వాతావరణం ఉండటంతో చాలా కంపెనీలు క్యూ కడుతున్నాయి. తాజాగా.. మరో అంతర్జాతీయ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. మెడికల్, స్మార్ట్ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న షూఆల్స్ కొరియన్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. ఈ మేరకు షూఆల్స్ ఛైర్మన్ చెవోంగ్ లీతో పాటు కంపెనీ ప్రతినిధులు, తెలంగాణ ఐటీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో 750 ఎకరాలు కేటాయిస్తే రూ.300 కోట్లతో స్మార్ట్ షూ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామని షూ ఆల్స్ ప్రతినిధులు మంత్రిని కోరారు. ఈ కంపెనీ ద్వారా 87 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. ఈ మేరకు గిగా ఫ్యాక్టరీ ప్రతిపాదనను మంత్రి ముందు ఉంచారు. షూ అడుగు భాగాన (సోల్స్) మెడికల్ చిప్ ఉండే బూట్లు తయారు చేస్తామని.. పది వేల అడుగులు వేస్తే గంటకు 25 వాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందన్నారు. డయాబెటీస్, ఆర్థరైటిస్ ఉన్న వారికి ఈ స్మార్ట్ షూ ద్వారా ఉపశమనం కలుగుతుందని చెప్పారు. తమ కంపెనీ ఉత్పత్తుల తయారీ కోసం తెలంగాణలో 750 ఎకరాల భూమి అవసరమవుతుందని చెప్పారు. షూ కంపెనీ ప్రతినిధుల ప్రతిపాదనకు మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారు. షూఆల్స్ అభ్యర్థన అత్యంత ప్రాధాన్యమైనదిగా భావించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారీ షూ కంపెనీ తెలంగాణలో నెలకొల్పి ఇక్కడి నుంచే దేశీయ అవసరాలకు, అమెరికాతో పాటు ప్రపంచ మార్కెట్లకు స్మార్ట్ షూ సరఫరా చేస్తారని వివరించారు. షూ తయారీలో జంతువుల చర్మాన్ని వినియోగించడం వల్ల ఇక్కడ ట్యానరీలు అవసరమవుతాయని చెప్పారు. ఇలా యాన్సిల్లరీ పరిశ్రమలతో అనేక తెలంగాణలో వేల మందికి ఉపాధి దొరుకుంన్నారు. ప్రపంచ మార్కెట్లకు తెలంగాణ ఒక హబ్‌గా మారుతుందని వెల్లడించారు. ఇక స్మార్ట్ హెల్త్ సిటీ ఏర్పాటుతో లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని మంత్రి శ్రీధర్ వెల్లడించారు. తెలంగాణలోని టైర్ II, టైర్ III నగరాల్లో ఏర్పాటు చేసే పక్షంలో ఈ ప్రతిపాదనను తాము పరిశీలిస్తామని చెప్పినట్లు వెల్లడించారు.